News December 1, 2025

గద్వాల్: రూ.40.80లక్షలకు సర్పంచ్ పదవి ఏకగ్రీవం..!

image

రాజోలి(M) మాన్‌దొడ్డిలో సోమవారం సర్పంచ్ ఏకగ్రీవం సవాల్ పాట జరిగింది. ఈ ఏకగ్రీవం పోటీలో భీమన్న అనే వ్యక్తి రూ.40.80 లక్షలకు మాన్‌దొడ్డి సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మాన్‌దొడ్డి జనరల్ ఉమెన్‌కి రిజర్వేషన్ కేటాయించారు. ఏకగ్రీవం వెనక బీజేపీ నాయకులు ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్పంచును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 15, 2026

నల్గొండలో జన గణనకు రెడీ

image

నల్గొండలో జనగణన కోసం అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో మొత్తం జనాభా 34,88,809. పురుషులు 17,58,772, మహిళలు 17,29,037. తాజా గణనలో సుమారు 16,18,416 కుటుంబాల వివరాలు సేకరించడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో 8,18,306, పట్టణాల్లో 8,00,110 కుటుంబాల నుంచి సమాచారం నమోదు చేయనున్నారు. ఇంటింటి సర్వేకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి డిజిటల్ విధానంలో డేటా తీసుకోనున్నారు.

News March 15, 2026

నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

News March 15, 2026

నెల్లూరు: ఉదయాన్నే రామాపురం వద్ద ప్రమాదం

image

వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారిపై చింతపండు లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హిందూపూర్ నుంచి కనిగిరి వైపు చింతపండు లోడుతో వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌ దాదా పీర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.