News December 1, 2025

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

image

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.

Similar News

News March 21, 2026

కృష్ణా: నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

image

గన్నవరంలో క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన నాగరాజు (ఫైల్ ఫొటో) అనే వ్యక్తి, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. అప్పులవారు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక 2 రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

image

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్ర‌మంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.

News March 21, 2026

TTD ఆలయాల ఆధునీకరణకు CM దిశానిర్దేశం

image

CM చంద్రబాబు సూచనలతో టీటీడీ ఆలయాలను ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమీక్షించిన సీఎం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను మెరుగుపరచాలన్నారు. లడ్డూ తయారీ, అన్నదానం, ప్రాణదానం సేవలను నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే సేవకులకు శిక్షణ ఇచ్చి అన్ని ఆలయాల్లో సేవలను విస్తరించాలని CM సూచించారు.