News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
Similar News
News March 25, 2026
ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.
News March 25, 2026
లాస్ట్ మినిట్ డుమ్మాతో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది: గంగూలీ

టీమ్ ఇండియా కంటే IPL టీమ్‌ను నిర్మించడమే కష్టమని గంగూలీ అన్నారు. ‘భారత జట్టుకైతే బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ IPLలో ప్లేయర్స్ 10 టీమ్స్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇలాంటి టైమ్‌లో క్వాలిటీ ప్లేయర్స్ లాస్ట్ మినిట్‌లో రాకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది’ అని గంగూలీ అన్నారు. మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఈ కామెంట్స్ చేశారు.
News March 25, 2026
మార్చి 25: చరిత్రలో ఈరోజు

1655: శని గ్రహ అతిపెద్ద ఉపగ్రహం టైటాన్‌ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు.
1914: ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జననం (ఫొటోలో)
1931: స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు గణేశ్ శంకర్ విద్యార్థి మరణం.
1933: భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ జననం.
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం.


