News December 1, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News March 14, 2026
రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.
News March 14, 2026
కోదాడలో కల్తీ వంటనూనె కలకలం

కోదాడ పట్టణంలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News March 14, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.


