News December 1, 2025

జగిత్యాల: ‘వయోవృద్ధుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి’

image

సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 21, 2026

రేపు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి 60 రోజులుగా చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. ఎర్రంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. సర్పంచిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1998లో మార్కెఫెడ్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో తొలిసారి TDP అభ్యర్థిగా పోటీచేసి రఘువీరా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.

News March 21, 2026

జనగామ: తీరనున్న విద్యార్థుల అర్ధాకలి చదువులు!

image

జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులకు ఆకలి కష్టాలు తప్పనున్నాయి. నిండు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు లేక, బస్సులు వచ్చే సమయానికి వంట కాక ఇబ్బందులు పడ్డారు.

News March 21, 2026

ఎన్టీఆర్: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కన్నబాబు

image

APCRDA కమిషనర్ కన్నబాబు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2012 IAS బ్యాచ్‌కు వి. విజయరామరాజు CRDA కమిషనర్‌గా నియమితులయ్యారు. కాగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న సౌరభ్ గౌర్ రిలీవ్ అయ్యారు. 2025 జనవరి నెలలో APCRDA కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కన్నబాబు 2026 మార్చి వరకు కొనసాగి, తాజాగా బదిలీ అవుతున్నారు.