News December 1, 2025

సిరిసిల్ల: కొత్త యాజమాన్యాలు చేతికి మద్యం దుకాణాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు కొత్త యాజమాన్యాల నిర్వహణలోకి వచ్చాయి. Dec 1 నుంచి జిల్లాలోని 48 దుకాణాల నిర్వహణకు గత నెలలో టెండర్లు నిర్వహించగా, టెండర్ దక్కినవారు సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలో చాలా దుకాణాలు కొత్త వ్యాపారులకు దక్కగా, పాతవారికి కొందరికే అవకాశం లభించింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు వారికి గుడ్‌విల్ ఇచ్చి తిరిగి దుకాణాలను దక్కించుకున్నారు.

Similar News

News March 18, 2026

WGL: అమ్మాయిలూ.. 8712685142కు కాల్ చేయండి!

image

మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా వరంగల్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు వేధింపుల నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వేధింపులకు గురైతే భయపడకుండా 8712685142 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.

News March 18, 2026

గోదావరి పుష్కరాలకు భద్రాద్రిలో 9 ఘాట్లకు రూ.376 కోట్లు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2027 గోదావరి పుష్కరాల కోసం 9ః ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.376 కోట్లు కేటాయించింది. భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయనున్నారు. భద్రాచలం, మోతేగడ్డ, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, అశ్వాపురం ప్రధాన తీర ప్రాంతాలు, మోతేగడ్డలో ప్రత్యేక VIP ఘాట్ ఏర్పాటు చేయనున్నారు.

News March 18, 2026

కోవూరు: ఇల్లా.. నందనవనమా..?

image

కోవూరు మండలం పాటూరులో ఓ వ్యక్తి తన ఇంటిని పూల చెట్లతో నందనవనంలా మార్చాడు. తన మూడు అంతస్తుల ఇంటిని ఒక్కొక్క అంతస్తుకి ఒక అరలాగా కనిపించేలా కాగితాల పూల చెట్లను అల్లించాడు. దీంతో వేసవి కాలంలో ఆ ఇంట్లో చల్లదనం తోపాటు స్వచ్ఛమైన గాలి అందుతోంది. ఈ రంగు రంగుల కాగితాల పూలతో ఆ ఇల్లు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటోంది.