News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్‌లో ఆడి పాడి సేద తీరారు.
Similar News
News December 3, 2025
మలి దశ తొలి అమరుడా.. ‘నిను మరువబోదు ఈ గడ్డ’

తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తొచ్చేది అమరుల బలిదానాలే. స్వరాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం(2009)లో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి. చావు బతుకుల్లోనూ ‘బతికినా మళ్లీ తెలంగాణ కోసం చస్తా’ అన్న ఆయన వ్యాఖ్యలు కోట్లాది మందిలో ఉద్యమకాంక్షను రగిల్చాయి. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిప్పు కణికలై ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి.
News December 3, 2025
HYD: విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం..!

GHMCలో శివారు ప్రాంతాల విలీనానికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ విలీనంతో నేతలు, రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ స్థాయి నేతల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఎందుకీ విలీనం, భూములే లేనిచోట అభివృద్ధిపై వివరణ ఎక్కడని ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లేలేని తమని ట్యాక్స్ కట్టడంలో బంజారాహిల్స్‌తో పోటీ పడమంటారా అని మేడ్చల్, RR ప్రజలు భగ్గుమంటున్నారు.
News December 3, 2025
చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు అవుతున్నాయా?

ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని టాడ్లర్స్ డయేరియా అంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థాలు, తీపి తగ్గించడంతో పాటు జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అయినా తగ్గకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావొచ్చు. దీనికి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.


