News December 1, 2025
ములుగు: చల్పాక ఎన్‌కౌంటర్‌కు ఏడాది

ఏటూరునాగారంలోని చల్పాక అటవీ ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్ 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన జరిగి నేటికీ సరిగ్గా ఏడాది. కాగా, ఎన్‌కౌంటర్‌కు కీలక నేత బద్రు, మల్లయ్య, దేవల్, జమున, కిషోర్, కామేష్‌తోపాటు మరో సభ్యుడు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 7, 2026
భవిష్యత్‌లో అనేక దేశాలకు భారత్ విద్యుత్: సీఎం

AP: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని CM CBN తెలిపారు. డిప్లమసీ, ఫ్లెక్సిబిలిటీలో మనవాళ్లకు మంచి పేరుందన్నారు. ITలో ఇండియన్స్ పరిజ్ఞానం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ దూసుకెళ్తోంది. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ అందిస్తుంది’ అని జోస్యం చెప్పారు.
News March 7, 2026
సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.
News March 7, 2026
ప.గో: చంద్రబాబు తప్పిదంతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం.. వైసీపీ ట్వీట్

పోలవరం స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడం వల్లే నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, చంద్రబాబు తప్పిదం వల్లే ఇలా జరిగిందని ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. 2022లో అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పారని, అప్పట్లో టీడీపీ నేతలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేదని ఆ పార్టీ తాజా ట్వీట్‌లో గుర్తు చేసింది.


