News December 1, 2025

పేదలకు వరం.. ఖమ్మం జీజీహెచ్‌లో పేస్‌మేకర్ సర్జరీ

image

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పేద ప్రజలకు భారీ ఖర్చుతో కూడిన పేస్‌మేకర్ సర్జరీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గుండె కొట్టుకునే వేగం తగ్గిన తిరుమలాయపాలెంకు చెందిన 67ఏళ్ల దామెర వెంకన్నకు డాక్టర్ సీతారాం, డాక్టర్ జియా నేతృత్వంలోని వైద్య బృందం నవంబర్ 30న శాశ్వత పేస్‌మేకర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ఈ వైద్య బృందాన్ని అభినందించారు.

Similar News

News March 7, 2026

ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

image

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.

News March 7, 2026

అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

News March 6, 2026

అంధుల పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాల పనులను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. భవన నాణ్యత, తరగతి గదులు, టాయిలెట్స్, ప్రవేశ మార్గాలు, భద్రతా సదుపాయాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంధ విద్యార్థులకు బ్రెయిల్ లిటరసీ డివైస్, ఆడియో పాఠాల సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.