News December 1, 2025
గోదావరిలో మునిగి వెంకటపూర్ వ్యక్తి మృతి

మంథని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన పంచిక సదానందం (44) ఆదివారం ఉదయం గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. బోనాల సందర్భంగా ఆరెంద గ్రామ సమీపంలోని నదికి వెళ్లిన అతడు నీటిలో కొట్టుకుపోయాడు. గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంథని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 2, 2025
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు NMUA, ఎంప్లాయీస్ యూనియన్లకు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి వివరించి పరిష్కారాల కోసం చర్చలు జరపవచ్చు.

జగిత్యాల: సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో రెండవ రోజు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అలాగే వార్డు మెంబర్ స్థానాలకు 1279 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్-43, జగిత్యాల-24, జగిత్యాల(R)-103, కొడిమ్యాల-99, మల్యాల-72, రాయికల్-106, సారంగాపూర్-61 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.