News December 1, 2025
రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం విచారణ జరిపారు. 6 నెలల్లో తన పదవి కాలం పూర్తవుతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని ఛైర్మన్ సూచించడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. YCP తరఫున MLC గా ఎన్నికైన ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Similar News
News March 19, 2026
పెద్దపల్లి: 58 మందితో జంబో డీసీసీ నియామకం

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీని టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ప్రకటించారు. అధ్యక్షుడుగా రాజ్ ఠాకూర్ ను కొనసాగిస్తుండగా, మరో 58 మందితో జంబో కార్యవర్గాన్ని నియమించారు. ఉపాధ్యక్షులు 6, జనరల్ సెక్రెటరీ 12, ట్రెజరర్ 01, స్పోక్ పర్సన్స్ 4, సెక్రటరీస్ 16, కార్యవర్గ సభ్యులు 19 మందిని నియమించారు. ఉపాధ్యక్షులుగా దీటి బాలరాజు, హనుమంత రెడ్డి, మారెల్లి రాజిరెడ్డి, మునీర్, వెంకటేశ్వరరావును నియమించారు.
News March 19, 2026
యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.
News March 19, 2026
పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన లోకేశ్: హోంమంత్రి అనిత

వివిధ ప్రభుత్వ శాఖలలో 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని ‘X’ వేదికగా అభినందించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


