News December 1, 2025

వాలీబాల్ టోర్నీ సెమీస్ చేరిన బాలుర జట్లు ఇవే :

image

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధించినట్లు రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు. ఉమ్మడి నుంచి వచ్చిన పది జట్ల మధ్య నిర్వహించిన పోటీల విజేతల నుండి సెమీస్ కు చేరిన జట్లను ఎంపిక చేశారు.

Similar News

News March 18, 2026

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షలు.. 387 మంది డుమ్మా..!

image

జిల్లాలో బుధవారం 31 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. నేడు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 1,969 మంది మాత్రమే పరీక్ష రాశారు. 387 మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కడప మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

పెద్దపల్లి: 9 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి రెండవ రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,480 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.9 శాతం హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం

image

అమావాస్య పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో చండీ హోమం వైభవంగా జరిగింది. కొండపై నూతనంగా నిర్మించిన యాగశాల భక్తుల విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో దాదాపు 372 మంది భక్తులు (186 జంటలు) హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారు.