News December 1, 2025
పెద్దపల్లి: ఎల్లమ్మ గూడెం ఘటనను ఖండించిన యాదవులు

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో యాదవ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు ప్రవర్తించిన తీరును యాదవ యువజన సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిరచారు. ఈ రోజు పెద్దపల్లిలోని యాదవ భవన్‌లో వారు మాట్లాడారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు యాదవ సంఘం నాయకులున్నారు.
Similar News
News March 5, 2026
SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 227 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 227 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు హిందీ పరీక్షలకు సంబంధించి 929 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా..702 మంది మాత్రమే రాశారు అన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సెట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 5, 2026
KMR: రేపు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం: డీఈఓ

ఈ నెల 6న జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక బాలిక, ఒక బాలున్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపించాలని ఉపాధ్యాయులను కోరారు. ‘వికసిత భారత్-అందులో నా భాగస్వామ్యం’ అన్న అంశంపై పలురకాల పోటీలు నిర్వహించారు. ఎంపిక చేసి పీఎం చదువుకున్న పాఠశాల గుజరాత్‌కు పంపిస్తామన్నారు.
News March 5, 2026
నా ఆరోగ్యం బాగానే ఉంది: హోంమంత్రి

తన ఆరోగ్యం బాగానే ఉందని<<19304560>> హోంమంత్రి<<>> వంగలపూడి అనిత పేర్కొన్నారు. తీవ్ర అలసటతో అసెంబ్లీ సమావేశాల్లో గురువారం స్పృహ తప్పడంతో సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. పలువురు హోంమంత్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండగా ఈ నేపథ్యంలో ఆమె ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అలసట కారణంగా చిన్న ఇబ్బంది ఏర్పడిందని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని అందులో తెలిపారు.


