News December 2, 2025
పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్‌తో పరిశీలించారు.
Similar News
News March 7, 2026
WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 7, 2026
MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News March 7, 2026
మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్‌కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


