News December 2, 2025
మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్‌లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.
Similar News
News March 18, 2026
PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News March 18, 2026
రాత్రి 9 గం. నుంచి ధురంధర్-2 తెలుగు షోలు

ధురంధర్-2 సినిమా ప్రీమియర్ షోలపై డైరెక్టర్ ఆదిత్య ధార్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు 9PMకు తెలుగు ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా హిందీ షోలు సా.5 గం.కే ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల మలయాళం, కన్నడ షోలు రేపు ఉదయం నుంచి ప్రారంభం అవుతాయన్నారు.
News March 18, 2026
సీఎస్ పదవీ కాలం మరోసారి పొడిగింపు

TG: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీకాలాన్ని కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాచారం అందించింది. గతంలో ఆయన పదవీకాలాన్ని 7 నెలలు పొడిగించగా ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.


