News April 18, 2024
తూ.గో: భవనం పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి

తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తు బిల్డింగు పై నుంచి కిందపడి షేక్ అసిన్(35) మృతి చెందినట్లు ఎస్సై కే సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని భీమోలు గ్రామంలో ఉదయం10 గంటలకు దాబాపై తాపీ పని చేస్తుండగా దురదృష్టవశాత్తు పై నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో గోపాలపురం ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
Similar News
News October 9, 2025
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు చేపట్టాం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామన్నారు.
News October 8, 2025
బాణసంచా తయారీకి అనుమతులు తప్పనిసరి: జేసీ

జిల్లాలో బాణసంచా తయారీదారులు, విక్రయదారులు రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బాణసంచా తయారీ కేంద్రాలను రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు బాణాసంచా తయారు కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలన్నారు.
News October 8, 2025
కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పురందీశ్వరీ

కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్‌లో అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాలకు రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి హాజరయ్యారు. ఆమె కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ (CWP) చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివాన్ష్, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీలు అనురాగ్ శర్మ, కె.సుధాకర్ కూడా పాల్గొన్నారు.