News December 2, 2025

జగిత్యాల: ‘ఎన్నికల ఖర్చుల్లో తేడాలు లేకుండా చూడాలి’

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యయపరిశీలకులు మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల నమోదు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఖర్చుల వివరాల్లో ఎలాంటి తేడాలు లేకుండా ప్రతిఅంశాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

అందుబాటులో గ్యాస్ సిలిండర్‌లు: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు.

News March 13, 2026

HNK: ఇంటి బాట పట్టిన ఇంటర్ విద్యార్థులు!

image

ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. హాస్టల్లో చదివిన విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకోవడానికి హనుమకొండ బస్టాండ్‌కు వచ్చారు. జిల్లా కేంద్రం నుంచి ములుగు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, కరీంనగర్, జమ్మికుంట తదితర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులతో బస్టాండు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ మేరకు ఆయా పాయింట్ల వద్ద బస్సులు అందుబాటులో ఉంచారు.

News March 13, 2026

పల్నాడు: బార్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-28 బార్ పాలసీ కింద కొత్త బార్ లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పల్నాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ శుక్రవారం తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలలో మొత్తం 10 బార్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మార్చి 13 నుంచి 24 సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మార్చి 25న కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహిస్తామని చెప్పారు.