News December 2, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1911, కనిష్ఠ ధర రూ.1725; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2090, కనిష్ఠ ధర రూ.2000; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2201, కనిష్ఠ ధర రూ.2131; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2301, కనిష్ఠ ధర రూ.2281; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3011, కనిష్ఠ ధర రూ.2130గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News March 24, 2026

IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

image

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.

News March 24, 2026

రాపూరు వస్తే.. అవకాశం ఎవరికి..!

image

కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో మరలా ఊహగానాలు మొదలయ్యాయి. 1952లో ఏర్పాటైన రాపూరు నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఈ ప్రాంతం శాసనసభ స్థానాల నుంచి తొలగించబడింది. 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎలక్షన్స్‌లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరలా రాపూరు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.

News March 24, 2026

ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: CM రేవంత్

image

TG: దేశ రాజకీయాల్లో తాను పని చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని టీవీ9 సమ్మిట్‌లో స్పష్టం చేశారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని, తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే ప్రజలు తనను హీరో చేశారని పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తల స్నేహితుడినని చెప్పారు.