News December 2, 2025

శ్రీకాకుళం: ఈనెల 5న మెగా పేరెంట్స్ మీట్.!

image

ఈనెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్-3.0 ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. సోమవారం జెడ్పీ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. గతంలో నిర్వహించిన 2 పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News March 19, 2026

శ్రీకాకుళం రోడ్డు-ఉర్లాం రైల్వేస్టేషన్ల మధ్య డెడ్ బాడీ కలకలం

image

శ్రీకాకుళం రోడ్డు-ఉర్లాం రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన గురువారం ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు..శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు పరిశీలించారు. మృతుడి వయస్సు 70 ఏళ్లు ఉంటాయని, గడుల షర్టు, పచ్చని లుంగీ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. వివరాలు తెలిసినవారు 94944 74582, 91103 05494 సంప్రదించాలన్నారు.

News March 19, 2026

రణస్థలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానని మనస్థాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలో జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు(17) ఇంటర్ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 19, 2026

సిక్కోలులో సైబర్ మోసం

image

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.