News December 2, 2025

ఆదిలాబాద్: నజరానా.. ఈసారైనా వచ్చేనా..?

image

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటికి ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో 160, NRMLలో 88, ASF జిల్లాలో 49 పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పంచాయతీలకు ప్రభుత్వం ఇంకా నజరానా విడుదల చేయలేదు. ఈసారి ఏకగ్రీవం చేస్తే మళ్లీ నిధులు వస్తాయో లేదోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిధులు వస్తే పంచాయితీలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.

Similar News

News December 3, 2025

చారకొండలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే బుధవారం చలి తీవ్రత కొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలంలో 17.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 18.5°C, వెల్దండలో 18.6°C, కల్వకుర్తిలో 18.9°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News December 3, 2025

ఆదిలాబాద్: CM సభ.. పార్కింగ్ వివరాలు

image

ADB స్టేడియంలో రేపు జరిగే CM సభకు వచ్చేవారి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
★టూ వీలర్ ప్రజలకు రామ్ లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసుకోవాలి
★ఆటోలకు, కార్లకు డైట్ కళాశాల మైదానం
★వీఐపీలకు శ్రీ సరస్వతి శిశు మందిర్, టీటీడీ కళ్యాణమండపం
★నిర్మల్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు పిట్టలవాడ, మావల PS మీదుగా వెళ్లి తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ Jr కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలి

News December 3, 2025

స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

image

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it