News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.
Similar News
News March 16, 2026
టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నగరంలోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఈవో బాలాజీ రావు పరిశీలించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని డీఈఓకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
News March 16, 2026
నెల్లూరు : మరి కాసేపట్లో మొదలుకానున్న పది పరీక్షలు

10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 174 కేంద్రాలలో 28,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 24 సిట్టింగ్ స్క్వార్డులు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షల్లో సమస్యలు ఎదురైతే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News March 16, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

పొదలకూరు మండలం మరుపూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ (14) అనే బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి వెళ్లి పాత తాగునీటి బావిలో మునిగి మృతి చెందాడు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో డైవింగ్ చేసిన తర్వాత పైకి రాకపోవడంతో గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.


