News December 2, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.

Similar News

News March 14, 2026

బుకింగ్ తర్వాత గ్యాస్ రావడం లేదా? అయితే ఇలా చేయండి!

image

గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లో డెలివరీ కాకుంటే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్ఓ ప్రకాశ్ రావు శనివారం తెలిపారు. ఇండేన్ వినియోగదారులు 1800-2333-555, 7718955555 నంబర్లకు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344, 7715012345కు ఫోన్ చేయాలన్నారు. HP గ్యాస్ వారు 1800-2333-555, 9493602222 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 14, 2026

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.

News March 14, 2026

తిరుమలలో నిత్యం కల్యాణమే..

image

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.