News December 2, 2025
సిరిసిల్ల: నేడే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ ఫైనల్స్

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్స్ 2వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. బాలురు, బాలికల విభాగంలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఉదయం వేళలో సెమీఫైనల్స్ మ్యాచ్ లు ఉంటాయని, సెమీఫైనల్స్ విజేతల మధ్య సాయంత్రం వేళలో ఫైనల్స్ మ్యాచ్ నిర్వహిస్తామని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, కార్యదర్శి రాందాస్, రెఫరీ కమిటీ కన్వీనర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 13, 2026
అమరావతిలో NTPC కార్యాలయానికి లీజ్ ఒప్పందం

అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ NTPC లిమిటెడ్‌తో ఏపీసీఆర్‌డీఏ లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీసీఆర్‌డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ జుబిన్ చెరన్ రాయ్, NTPC తరఫున కుందారం పవన్ కుమార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాజధాని ప్రాంతంలో సంస్థాగత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.
News March 13, 2026
ఈనెల 14న జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్: శ్రీదేవి

ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 14వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులు, న్యాయవాదులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, రాజీ చేయబడతాయన్నారు.
News March 13, 2026
జగిత్యాల రైతులకు ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్ర

జగిత్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 150 మంది ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులను సిద్ధిపేట జిల్లా అక్కనపల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలు, నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కోత విధానం గురించి అవగాహన కల్పించారు.


