News December 2, 2025
సిరిసిల్ల: నేడే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ ఫైనల్స్

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్స్ 2వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. బాలురు, బాలికల విభాగంలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఉదయం వేళలో సెమీఫైనల్స్ మ్యాచ్ లు ఉంటాయని, సెమీఫైనల్స్ విజేతల మధ్య సాయంత్రం వేళలో ఫైనల్స్ మ్యాచ్ నిర్వహిస్తామని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, కార్యదర్శి రాందాస్, రెఫరీ కమిటీ కన్వీనర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 15, 2026
జగిత్యాల: సైబర్ మోసగాళ్ల వలలో పోలీసు అధికారి.!

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.
News March 15, 2026
నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 15, 2026
పాలమూరు: వినియోగదారా మేల్కో.. మోసపోతే ఫిర్యాదు చేయి!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల కల్తీ పెరిగిపోయి సామాన్యూడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఈ సమస్యపై ఉమ్మడి జిల్లాలో ఆరేళ్లలో 668 కేసులు నమోదవగా, 173 పెండింగ్‌లో ఉన్నాయి. వ్యాపారుల మోసాలను ఎదిరించడమే వినియోగదారుడి హక్కు. నేడు ‘WORLD CONSUMER RIGHTS DAY’న ఈ నంబర్లను గుర్తుంచుకోండి:
1: 1915, 1800114000
2: 180042500333
3: 1967
4: 08542245633
మోసాన్ని ప్రశ్నించి, రశీదు తప్పనిసరిగా తీసుకోండి.


