News December 2, 2025
WGL: ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన రెబల్స్ అభ్యర్థులు

ఎలాగైనా ఈసారి సర్పంచ్ కావాలంటూ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలువగా, అవే పార్టీల నుంచి రెబల్స్ సైతం నామినేషన్ వేయడంతో వారికి తలనొప్పిగా మారింది. రెబల్స్‌గా నామినేషన్ వేసినవారు విత్ డ్రా అయ్యేది లేదని, బరిలో నిలిచే తీరుతామంటూ సంకేతాలు అందడంతో వారితో ఓట్లు చీలుతాయని, విజయం కూడా కష్టంగానే ఉంటుందని వారిని విత్ డ్రా చేయించేందుకు పార్టీ సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటూ, మంతనాలు జరుపుతున్నారు.
Similar News
News March 7, 2026
గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
News March 7, 2026
భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.
News March 7, 2026
మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.


