News December 2, 2025
HIVకి భయపడవద్దు: శ్రీకాకుళం కలెక్టర్

హెచ్ఐవికి భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారిపట్ల వివక్ష చూపరాదని సూచించారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.
Similar News
News April 3, 2026
శ్రీకాకుళం: ‘నిబంధనల మేరకు ఎగ్జామినర్లను నియమించాలి’

పదో తరగతి మూల్యంకనం ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్పాట్ వాల్యేయేషన్ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియమించాలని డీటీఎఫ్ నాయకులు కృష్ణారావు, హరి ప్రసన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఉపాధ్యాయ సంఘ సమన్వయ కమిటీలో విద్యాశాఖ అధికారి రవిబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. సబ్జెక్ట్ డీల్ చేయని వారిని ఎగ్జామినర్ల నియామకం సరికాదన్నారు.
News April 3, 2026
శ్రీకాకుళం: స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు

ఈనెల ఆరవ తేదీన పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ మూల్యంకనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్, డీఈవో రవి బాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎగ్జామినర్ల నియామకం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన కేంద్రం వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు.
News April 3, 2026
శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో…?

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీల పాలకవర్గాలు పదవీకాలం గురువారంతో ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండల స్థాయి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం మేరకు బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది.


