News December 2, 2025

నేడు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రాక

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News March 5, 2026

బెంబేలెత్తున్న కర్నూలు జిల్లా ప్రజలు

image

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో కర్నూలు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో వేర్వేరుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం కర్నూలు జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News March 5, 2026

పాలమూరు: కోడి తెచ్చిన కొట్లాట.. ముగ్గురిపై కేసు

image

కుటుంబ వివాదంతో ఒకరిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. లింగాలకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో కోడి చనిపోవడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. భార్యను భర్త మందలించడంతో మల్లికార్జున్ మామ రత్నయ్య, వెంకటేశ్, శేఖర్ అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్ పోలీసులను ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదు చేశారు.

News March 5, 2026

తూ.గో: కల్తీ పాల ఘటనలో మరొకరి మృతి

image

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్యకుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.