News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

Similar News

News March 22, 2026

NGKL: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’

image

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. తొలిదశలో ఎకరా లోపు భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందనుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 3.41 లక్షల మంది రైతులకు గాను మొత్తం రూ.415.23 కోట్లు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 8.30 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది.

News March 22, 2026

ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

image

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.

News March 22, 2026

వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.