News December 2, 2025
HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
Similar News
News March 30, 2026
పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి పాకులాడుతున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ దేశ నేతల ప్రకటనలను ఇరాన్ ఖండించింది. పాక్ వేదికలపై చర్చల్లో తాము పాల్గొనలేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ Xలో స్పష్టం చేసింది. ‘అమెరికాతో ప్రత్యక్ష చర్చల్లేవు. వారు మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు చేస్తున్నారు. US దౌత్య విధానాలు నిత్యం మారుతున్నాయి’ అని పేర్కొంది.
News March 30, 2026
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: అనకాపల్లి ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ తుహిన్ సిన్హా బాధితుల నుంచి 64 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భూ తగాదాలు 31, కుటుంబ కలహాలు 2, ఐదు మోసాలతో సహా ఇతర సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. ఫిర్యాదులపై వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు పారదర్శకంగా, వేగంగా న్యాయం చేయడమే పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు.
News March 30, 2026
ఒంటిమిట్ట: కళ్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం జరగనుంది. ఈ కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీనికి తోడు లక్షలాదిమంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు రానున్నారు. దీనితో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


