News December 2, 2025
జగిత్యాల: సర్పంచ్‌కు 622.. వార్డు సభ్యులకు 2493

జగిత్యాల జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 122 గ్రామాల్లోని 1172 వార్డులకు వచ్చిన నామినేషన్‌లను స్క్రూటినీ చేసిన అనంతరం చెల్లుబాటైన నామినేషన్‌ల సంఖ్యను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 622 నామినేషన్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు 2493 నామినేషన్‌లు చెల్లుబాటు అయినట్లు తెలిపారు.
Similar News
News March 5, 2026
భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
News March 5, 2026
అహోబిలంలో తెప్పోత్సవాలు ప్రారంభం

దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో, కావు రామానుజన్ అధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకు వచ్చారు. తెప్పలో ఉంచి ఐదు చుట్టులు విహరింపజేశారు.
News March 5, 2026
భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.


