News December 2, 2025

VJA: నిధులపై వివరణ కోరిన ఎంపీ కేశినేని చిన్ని

image

సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మంజూరైన నిధులపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 1.83 లక్షల పనులకు ఆమోదం లభించగా, ఏపీలో 2,677 పనులకు ఆమోదం లభించి, 1,573 పనులు పూర్తయ్యాయి అని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి రూ.14,200.38 లక్షల నిధులు మంజూరైనట్లు వివరించారు.

Similar News

News March 29, 2026

వరదలు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు: పోలవరం కలెక్టర్

image

వరదలు ఎదుర్కొనే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ ఆదివారం అన్నారు. చింతూరు ఐటీడీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు వరదల సమయంలో ప్రజలకు మూడు నెలల రేషన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకున్నారు.

News March 29, 2026

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులు పాల్గొన్నారు.

News March 29, 2026

కర్నూలులో జాబ్ మేళా..1,110 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

image

కర్నూలు బి క్యాంప్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో మొత్తం 1,110 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, ఫార్మసీ చదివిన 18-35 ఏళ్ల యువతీ యువకులు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. సర్టిఫికేట్లతో ఉ.10 గంటల నుంచి నేరుగా హాజరుకావాలని ఆయన కోరారు.