News December 2, 2025
వేములవాడ, కరీంనగర్ నుంచి అరుణాచలానికి RTC బస్సు

అరుణాచలానికి వేములవాడ నుంచి SL బస్సును ఏర్పాటుచేసినట్లు KNR-2 DM శ్రీనివాస్ తెలిపారు. DEC 6న VMLD నుంచి మ.12:30కు బయలుదేరి KNR మీదుగా DEC 7న ఉ. కాణిపాకం చేరుకుంటుందన్నారు. తర్వాత కంచి టెంపుల్, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం, DEC 8న వేకువజామున అరుణాచలం చేరుకుంటుంది. DEC 8న రాత్రి బయలుదేరి, DEC 9న ఉ. జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనానంతరం అదే రోజు రాత్రి KNR మీదుగా VMLDకు చేరుకుంటుందన్నారు.
Similar News
News March 28, 2026
పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల, ఆర్మూర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తాగునీరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News March 28, 2026
మెదక్: ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమాన్ని మెదక్ టౌన్‌లోని ఓ గార్డెన్లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు తెలిపారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
News March 28, 2026
PDPL: సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

PDPL కలెక్టరేట్‌లో హాస్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు. భోజనం, స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాజరై ఉండాలని, హాస్టళ్లలోనే నివసించాలని స్పష్టం చేశారు. కేటాయించిన బడ్జెట్‌ను నెలాఖరు లోపు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల చదువుకు అనుకూలంగా స్టడీ అవర్స్ నిరంతరం నిర్వహించాలని తెలిపారు.


