News December 2, 2025

BSWD: సింగిల్ విండో ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన పరిగె శ్రీనివాస్ రెడ్డి 1978లో దేశాయ్ పేట్ సింగిల్ విండో ఛైర్మన్‌గా తొలిసారిగా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసి 1994లో టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదుపరి 1998, 1991, 2001, 2014లో మంత్రిగా పని చేశారు. 2019 నుంచి 2023వరకు స్పీకర్‌గా, ప్రస్తుతం MLAగా పని చేస్తున్నారు.

Similar News

News March 21, 2026

వరంగల్: బడ్జెట్ కేటాయింపులు.. పలు రంగాలకు నిధుల వరద!

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు పలు రంగాలకు నిధులు కేటాయించారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ.445 కోట్లు, జీఎల్ఐఎస్‌కు రూ.5 కోట్లు, పర్యాటక కేంద్రాలైన రామప్ప, లక్నవరం తదితరాలకు రూ.4 కోట్లు మంజూరు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు, క్రీడా పాఠశాలలకు రూ.42.80 కోట్లు, పోలీస్ కమిషనరేట్ భవనాలకు రూ.10 కోట్లు కేటాయించారు. మేడారం జాతర, ఫారెస్ట్ కాలేజీ, వెటర్నరీ కళాశాలకు కూడా నిధులు మంజూరయ్యాయి.

News March 21, 2026

డిండి ప్రాజెక్టుకు నిధుల వరద

image

జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరందించే డిండి పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పనులు వేగవంతం చేసేందుకు ప్రగతి పద్దు కింద అదనంగా రూ.200 కోట్లు ఇచ్చింది. ప్రధాన పనులకు గతేడాది రూ.270 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.325.10 కోట్లు కేటాయించింది. కాలువలకు రూ.235 కోట్లు మంజూరు చేసింది. ఏదుల వద్ద నీటి మట్టం పెంపు ప్రతిపాదన వివాదంగా మారిన నేపథ్యంలో ఈ బడ్జెట్ పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 21, 2026

జనగామ: 35 శాతం రాయితీతో.. రూ.10 లక్షల వరకు రుణం!

image

మహిళలను స్వయం ఉపాధి వ్యాపారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ పరిశ్రమలను(పీఎంఎఫ్ఎంఈ) ఏర్పాటు చేయనుంది. ఈ పథకంలో 36 రకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు 35 శాతం రుణ రాయితీతో రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.