News December 2, 2025
పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు: మాజీ మంత్రి

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోకస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News March 31, 2026
ADB: మావోయిస్టు సుజాత లొంగిపోవాలి: DGP

మావోయిస్టు అగ్రనేత జోడే రత్నబాయి అలియాస్ సుజాత జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర డీజీపీ అధికారికంగా విజ్ఞప్తి చేశారు. సుజాత నార్నూర్ మండలానికి చెందినవారు. రూ. 20 లక్షల రివార్డు కలిగిన సుజాత గనుక లొంగిపోతే, ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం, పునరావాసం కల్పిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. హింసను వదిలి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని ఆయన ‘X’ వేదికగా కోరారు.
News March 31, 2026
BREAKING: HYDలో తీవ్ర విషాదం

కూకట్‌పల్లి PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలిని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండా వాసిగా గుర్తించారు.
News March 31, 2026
అమ్రాబాద్ గిరిజనుల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ

టైగర్ రిజర్వ్ గ్రామాల తరలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 160 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున ప్యాకేజీని జమ చేసింది. పునరావాసం కల్పిస్తూ ఆర్థిక సాయం అందించినందుకు సార్లపల్లి గ్రామస్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త గ్రామాల్లో మౌలిక వసతుల పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి.


