News December 2, 2025

పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు: మాజీ మంత్రి

image

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోకస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Similar News

News March 8, 2026

ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

విజయవాడలోని ప్రభుత్వ డెంటల్ కళాశాల, ఆసుపత్రిలో 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్ పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నామని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12లోపు ఆఫ్‌‌‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు తెలిపారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు చేపడతామని, వివరాలకై https://gdchvja.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

News March 8, 2026

నిర్మల్: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఎస్పీ

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదివారం మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె కొనియాడారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల రక్షణ మరియు సాధికారతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

News March 8, 2026

NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

image

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.