News December 2, 2025
VKB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలు సరైన విధంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు మూడు విడుదలగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అవసరమైన బ్యాలెట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
Similar News
News March 13, 2026
ప్రశాంతంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

భద్రాద్రి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు DIEO వెంకటేశ్వర్లు తెలిపారు. కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–II పరీక్షలకు 37 కేంద్రాల్లో మొత్తం 7,885 మంది విద్యార్థులకు గానూ 7,641 మంది హాజరయ్యారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు సజావుగా సాగాయని స్పష్టం చేశారు.
News March 13, 2026
గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: కలెక్టర్ అంకిత్

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
ADB: స్కాలర్ షిప్స్ నేరుగా అకౌంట్‌లో జమ

జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను చెల్లించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి తెలిపారు. మంజూరైన డబ్బుల్లో విద్యార్థుల నిర్వహణకు కొంత డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజు కింద కళాశాలలకు చెల్లించాలని సూచించారు.


