News December 2, 2025

VKB: 262 GPలకు 1216 నామినేషన్స్

image

జిల్లాలో మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 262 జీపీలకు 1216 సర్పంచ్ నామినేషన్లు, 2198 వార్డులకు 4311 నామినేషన్లు సరైనవి ఉన్నట్లుగా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్ పూర్తి చేసి సరైనవిగా గుర్తించినట్లు తెలిపారు. అభ్యర్థులు సరైన విధంగా ధ్రువపత్రాలు పొందుపరిచినట్లు చెప్పారు.

Similar News

News March 20, 2026

పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన

image

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో సాధారణ వాహన ఇంధన ధరలను పెంచబోమని IOCL ప్రకటించింది. ప్రీమియం పెట్రోల్ XP-95(పవర్ పెట్రోల్) రేట్లను మాత్రమే పెంచామని, ఈ ప్రభావం స్వల్ప స్థాయిలోనే ఉంటుందని తెలిపింది. సరసమైన ధరల్లో స్థిరమైన సరఫరాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా <<19432956>>పవర్ పెట్రోల్<<>> లీటర్‌పై రూ.2.35 వరకు, ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్‌పై రూ.22 పెంచిన విషయం <<19434174>>తెలిసిందే.<<>>

News March 20, 2026

అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలి: మంత్రులు

image

వ‌చ్చే ఏడాది గోదావరి పుష్క‌రాలు ప్రారంభ‌మ‌య్యేనాటికి భ‌ద్రాచ‌లంలో పుష్క‌ర ఘాట్‌తో పాటు మొద‌టి ద‌శ ఆల‌య అభివృద్ది ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌ణాళికలు సిద్ధం చేయాల‌ని శుక్రవారం మంత్రులు సురేఖ, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు అధికారుల‌ను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామ‌న్నారు. భ‌ద్రాచ‌లం స‌మీపంలోని రామ‌వ‌రంలో ట్రైబ‌ల్ మ్యూజియం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

News March 20, 2026

3 ద‌శల్లో భద్రాచలం అభివృద్ధి ప‌నులు: మంత్రులు

image

భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై శుక్ర‌వారం సచివాల‌యంలోని మంత్రి కొండా సురేఖ కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 200 సంవ‌త్స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం భ‌క్తుల మ‌నోభావాల‌కు అనుగుణంగా మూడు ద‌శల్లో ఆల‌యాన్ని అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.