News December 2, 2025
VKB: 262 GPలకు 1216 నామినేషన్స్

జిల్లాలో మొదటి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 262 జీపీలకు 1216 సర్పంచ్ నామినేషన్లు, 2198 వార్డులకు 4311 నామినేషన్లు సరైనవి ఉన్నట్లుగా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్ పూర్తి చేసి సరైనవిగా గుర్తించినట్లు తెలిపారు. అభ్యర్థులు సరైన విధంగా ధ్రువపత్రాలు పొందుపరిచినట్లు చెప్పారు.
Similar News
News April 6, 2026
ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్‌ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్‌ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.
News April 6, 2026
సంగారెడ్డి: వివాహేతర సంబంధం.. కత్తితో పొడిచి చంపిన భర్త

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాలిలా.. జహీరాబాద్‌కు చెందిన కవిత(29) గత నెలలో మరొకరితో వెళ్లిపోయింది. జడ్చర్లలో ఆమెను గుర్తించిన పోలీసులు తీసుకొస్తుండగా సదాశివపేట మండలం నందికంది వద్ద మార్గమధ్యంలో భర్త సిద్ధారెడ్డి కత్తితో కవితపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2026
VKB: ‘అధికారులు కీలక భూమిక పోషించాలి’

ప్రజావాణికి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.


