News December 2, 2025

శుభ సమయం (02-12-2025) మంగళవారం

image

✒ తిథి: శుక్ల ద్వాదశి మ.12.15 వరకు
✒ నక్షత్రం: అశ్విని సా.6.39 వరకు
✒ శుభ సమయాలు: సా.5.20-సా.6.20
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: మ.2.52-సా.4.22
✒ అమృత ఘడియలు: ఉ.11.49-మ.1.29

Similar News

News March 13, 2026

‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

image

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

News March 13, 2026

IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

image

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నారు.

News March 13, 2026

విజయ్ ఎన్డీఏలో చేరతారా?

image

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న TVK చీఫ్ విజయ్ రేపటి ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. NDAతో పొత్తుపై చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. విజయ్ NDAలో చేరేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి పార్టీ మీటింగ్‌లోనూ కొందరు TVK నేతలూ కమలదళంతో పొత్తుకే మొగ్గు చూపారట.