News December 2, 2025
శుభ సమయం (02-12-2025) మంగళవారం

✒ తిథి: శుక్ల ద్వాదశి మ.12.15 వరకు
✒ నక్షత్రం: అశ్విని సా.6.39 వరకు
✒ శుభ సమయాలు: సా.5.20-సా.6.20
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: మ.2.52-సా.4.22
✒ అమృత ఘడియలు: ఉ.11.49-మ.1.29
Similar News
News March 16, 2026
SSC ఎగ్జామ్స్ శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా..ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.
News March 16, 2026
నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ

AP: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా అమరావతిలోని తుళ్లూరులో 58 అడుగుల విగ్రహాన్ని CM చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. ₹150 కోట్ల అంచనా వ్యయంతో 6.8 ఎకరాల్లో చేపట్టిన స్మృతి వనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మిస్తారు.
News March 16, 2026
‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్‌లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది.


