News December 2, 2025

ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News March 25, 2026

JGTL: సెంటర్ ఒక దగ్గర.. పరీక్ష రాసేది మరో దగ్గర.!

image

జగిత్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అ పాఠశాల నిర్వాహకులు కొంతమంది విద్యార్థులను పక్కన ఉన్న Pvt JR కాలేజ్‌లో పరీక్షలు రాయిస్తున్నారు. అడ్రస్‌లోని స్కూల్లో కాక నిబంధనలకు విరుద్ధంగా పక్క కాలేజీలో పరీక్షలు రాయించడం పట్ల తల్లిదండ్రులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 పరీక్షలు జరిగినా విద్యాశాఖ గుర్తించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

News March 25, 2026

‘కంటికి తల..’ ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

image

5 రోజులు దాడులు ఆపుతామని ట్రంప్ చెప్పినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చెయ్యేస్తే ‘కంటికి కన్ను కాదు.. కంటికి తల’ తీస్తామంటూ IRGC మాజీ కమాండర్ మొహసేన్ రెజాయీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా షిప్పులను గల్ఫ్‌లో ముంచేస్తామని హెచ్చరించారు. ఆంక్షలు ఎత్తేసి, నష్టపరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని తేల్చి చెప్పారు. USను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం లేదని హెచ్చరించారు.

News March 25, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.