News December 2, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 19, 2026

సురక్షిత బాల్యానికి ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’: VZM ఎస్పీ

image

విజయనగరంలో పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు గురువారం ఎస్పీ దామోదర్ తెలిపారు. పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద ఘటనలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి వేధింపులు గమనించినా ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ వాట్సాప్ 7993485111కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 19, 2026

VZM: పరీక్షల ముగింపు.. స్టేషన్‌లో కిక్కిరిసిన జనం

image

విజయనగరం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి భారీ రద్దీ కనిపించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ముగియడంతో పాటు ఉగాది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫారాలు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎక్కువగా కనిపించారు. దీనితో రైల్వే సిబ్బంది తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

News March 19, 2026

VZM: ‘రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు’

image

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.