News December 2, 2025

పలు శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన: కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేస్తున్న సేవల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయనే అంశంపై వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వాటిలో వైద్య ఆరోగ్య, దేవాదాయ, సర్వే, వ్యవసాయ శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉందన్నారు.

Similar News

News March 28, 2026

జగన్‌కు మాజీ సీఎం అని చెప్పుకొనే అర్హత లేదు: కడప ఎమ్మెల్యే

image

ఏపీ రాజధానిగా అమరావతి ఉండటానికి 2014-19లో మాజీ CM జగన్ మద్దతు తెలిపారని MLA మాధవిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఇవాళ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తీర్మాన సభలో ఆమె మాట్లాడారు. 2019లో ఏపీ ప్రజలు జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. దీంతో ప్రజలు వారికి 11 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌కు మాజీ సీఎం అని చెప్పుకొనే అర్హత కూడా లేదన్నారు.

News March 28, 2026

ఏలూరు: బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్.. వెలుగులోకి సంచలన నిజాలు

image

ఏలూరు బీఫార్మసీ విద్యార్థిని సువర్షిణి ఆత్మహత్య వెనుక ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక సీనియర్ విద్యార్థిని పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఉపసంహరించుకోవాలని సువర్షిణి తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

News March 28, 2026

TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>