News December 2, 2025
విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News April 8, 2026
కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం

కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 7, 2026
పరిశ్రమల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. మంగళవారం పరిశ్రమల పురోగతిపై యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల స్థితిగతులను ఆరా తీసిన కలెక్టర్.. ఎదురయ్యే సమస్యలను వెంటనే తెలియజేయాలని చెప్పారు. అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, పనులు వేగంగా పూర్తి చేస్తామని యాజమానులు వెల్లడించారు.
News April 7, 2026
వంద రోజుల ప్రణాళికను అమలు చేయండి: కలెక్టర్

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహణ, వీబీ జీ రామ్ జీ పథకం అమలు గురించి ఇరిగేషన్, డ్వామా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగునీటి నిల్వలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.


