News April 18, 2024

జగన్‌పై దాడిని TDPకి ఆపాదించే కుట్ర: బోండా ఉమ

image

AP: సీఎం జగన్‌పై దాడిని టీడీపీకి ఆపాదించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ‘కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మాజీ మంత్రి వెలంపల్లి కాలికి గాయమైతే.. కంటికి కట్టు కట్టుకున్నారు. ఆయనకు దమ్ముంటే పబ్లిక్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. సానుభూతి రాజకీయాల కోసమే జగన్ నాటకాలు ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 18, 2024

టీడీపీ ఎమ్మెల్యేకు ‘విజనరీ లీడర్’ అవార్డు

image

AP: పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డును ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోయారు. ఆయన స్థానంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ పురస్కారం అందుకున్నారు. అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.

News November 18, 2024

అక్కడ మార్కులుండవ్.. ఎమోజీలే

image

పిల్లలకు పరీక్షలు, మార్కులు, గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేరళ కొచ్చిలోని CBSE స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాయి. KG నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు.

News November 18, 2024

USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్

image

అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్‌రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.