News December 2, 2025
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైళ్లకు అదనపు బోగీలు

పలు రైళ్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే తాత్కాలికంగా అదనపు బోగీలు జత చేసింది. ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని స్లీపర్, AC–3 కోచ్‌లలో డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటాయని వాల్తేరు రైల్వే కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంబల్పూర్, ఎరోడ్, భువనేశ్వర్, బెంగళూరు, తిరుపతి మార్గాల్లోని రైళ్లలో ఈ ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉండనునంది.
Similar News
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
News March 8, 2026
వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.
News March 8, 2026
గో బ్యాక్ చంద్రబాబు.. హామీల అమలేది?

ఈనెల 9న CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో డోన్ నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. డోన్‌లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు, డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడం, జలదుర్గం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం, హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను నింపడం వంటి హామీలు గుప్పించారు. వాటిని నెరవేర్చాలని ప్రజలు కోరుతుండగా, వామపక్షాలు గో బ్యాక్ చంద్రబాబు అంటున్నాయి.


