News December 2, 2025

తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

image

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Similar News

News March 5, 2026

SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 227 మంది గైర్హాజర్

image

శ్రీకాకుళం జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 227 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు హిందీ పరీక్షలకు సంబంధించి 929 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా..702 మంది మాత్రమే రాశారు అన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సెట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

News March 5, 2026

శ్రీకాకుళం: ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సిక్కోలు యువత అధికంగా విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటికప్పుడు జరిగిన త్రివిధ దళాల ర్యాలీల్లో పాల్గొని జాబ్స్‌ను సాధిస్తారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న వారికి మరో శుభవార్త. అగ్నివీర్ ద్వారా ఇంటర్ అర్హతతో ఈ నెల 8-18 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ఓపెన్ ర్యాలీ జరగనుంది. తక్కువ వయసులో ఉద్యోగాలు పొందేందుకు ఇదో చక్కటి అవకాశం.

News March 5, 2026

SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు

image

శ్రీకాకుళం నగరంలో మార్చి 8న కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘అస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. 13-18 ఏళ్లున్న వారు అర్హులన్నారు. https://nsrs.kheloindia.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.