News April 18, 2024

సమ్మర్‌లో కూల్ టిప్స్..

image

➯ఆల్కహాల్, కెఫీన్, డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేసి హీట్‌ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
➯ఇంట్లో డోర్లు, విండోలకు గ్రాస్ కర్టెన్ లాంటివి వినియోగించాలి.
➯నీరు, వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
➯వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చన్నీటి స్నానం శరీర వేడిని తగ్గిస్తుంది
➯సహజమైన గాలి ప్రవాహం కోసం ఇంట్లో వ్యతిరేక దిశల్లో ఉన్న కిటికీలను తెరిచి ఉంచాలి.

Similar News

News November 18, 2024

ALERT: ఈ రైళ్ల నంబర్లు మారుతున్నాయ్

image

వచ్చే ఏడాది మార్చి నుంచి పలు రైళ్ల నంబర్లను మార్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో విశాఖ-కడప, విశాఖ-గుంటూరు, భువనేశ్వర్-రామేశ్వరం, భువనేశ్వర్-పుదుచ్చేరి, భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ రైళ్లు ఉన్నాయి. నంబర్లను మార్చడానికి గల కారణాలను SCR వెల్లడించలేదు. ఏ తేదీ నుంచి ఏ ట్రైన్ నంబర్ మారుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.

News November 18, 2024

దారుణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, బాలిక హత్య!

image

HYDలోని మియాపూర్ అంజయ్య నగర్‌కు చెందిన బాలిక (17) ఈ నెల 8న అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు బాలిక డెడ్‌బాడీని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో గుర్తించారు. బాలికకు ఇన్‌స్టాలో పరిచయమైన ఉప్పుగూడ యువకుడే హత్యకు కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2024

గ్రూప్-3: సగం మంది పరీక్షలు రాయలేదు!

image

TG: గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50% మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్-1కు 51.1%, పేపర్-2కు 50.7%, నేడు నిర్వహించిన పేపర్-3కి 50.24% హాజరైనట్లు TGPSC తెలిపింది. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.