News December 2, 2025
తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 3, 2025
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: షర్మిల

కోనసీమకు TG ప్రజల దిష్టి తగిలిందంటూ Dy.CM పవన్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ‘పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలాయి. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
చౌడు నేలల్లో యూరియాను ఎలా వేస్తే మంచిది?

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.
News December 3, 2025
ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.


