News December 2, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News March 22, 2026
కాంగ్రెస్ బడ్జెట్‌పై పెద్దపల్లి బీఆర్‌ఎస్ నేతల ఘాటు విమర్శలు

PDPL ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం చూపారన్నారు. KCRహయాంలో అభివృద్ధి చెందిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని విమర్శించారు.
News March 22, 2026
రేపు PGRS రద్దు: కలెక్టర్

కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ ప్రకటించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో https://www.google.com/search?q=Meekosam.com నమోదు చేసుకోవాలని, పరిష్కార స్థితి కోసం 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
News March 22, 2026
ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.


